తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వినాయక చవితి వేడుకల వేళ కొత్తగూడెం పట్టణం పెద్ద బజార్ లో ఓ అరుదైన మరియు విస్మయపరిచే సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే కొయ్యడ. భాస్కర్ గారి ఇంట్లో కి మార్కెట్ నుండి నాలుగు రోజుల క్రితం టమాటాలు తెచ్చుకున్నారు తెచ్చుకున్నప్పుడు అన్ని టమాటాలు చూసుకొని ఏరుకొని తీసుకొచ్చుకున్నారు అప్పుడు అన్ని రౌండ్ గానే ఉన్నాయి ఈరోజు టమాట కూర చేద్దాం అని టమాటలు తియ్యగా అందులో ఒక టమాటా కి వినాయకుడు రూపం దర్శనమిచ్చింది టమాటాలపై వినాయకుడు తొండంతో కూడిన రూపంలో కొలువుదీరినట్లుగా ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ప్రకృతి సిద్ధంగా కూరగాయలపై ఇలాంటి రూపాలు ఏర్పడటం భక్తుల్లో దైవిక భావాలను కలిగించడమే కాక, పట్టణంలో విశేష చర్చనీయాంశమైంది.
Admin
తెలుగు వెలుగు టీవీ