Monday, 02 November 2026 07:00:22 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

క్యాడర్ స్కీమ్‌ను సవరించాలి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో ఉద్యమం: ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్.

Date : 12 October 2026 10:44 AM Views : 141

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్లర్క్‌గా చేరి క్లర్క్‌గానే రిటైర్ కావాలా. సెక్రటేరియల్ సిబ్బందికి పదోన్నతులు కల్పించి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇవ్వాలి.క్యాడర్ స్కీమ్‌ను సవరించాలి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో ఉద్యమం: ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్.సింగరేణి సంస్థలో సెక్రటేరియల్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ డిమాండ్ చేశారు.ఉద్యోగులు, కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ఎప్పుడూ వెనుకడుగు వేయదని, సెక్రటేరియల్ సిబ్బంది సైతం కార్మికవర్గంతో కలిసి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఉన్నత విద్యార్హతలు, సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ పదోన్నతులు లేకుండా ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరమని పేర్కొన్నారు.సింగరేణి సెక్రటేరియల్ సిబ్బంది సమస్యల పరిష్కారం, క్యాడర్ స్కీమ్ సవరణ, పదోన్నతుల కల్పన తదితర డిమాండ్ల సాధన కోసం ఆదివారం కొత్తగూడెంలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో కొత్తగూడెం రీజియన్‌ కార్పొరేట్, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల క్లరికల్ ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ కార్మిక సంఘాల నాయకులను ఆహ్వానించగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.సింగరేణిలో అమలవుతున్న క్యాడర్ స్కీమ్‌ను సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని సదస్సులో ఉద్యోగులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పీఏలు, ఓఎస్‌లకు తగిన పదోన్నతులు కల్పించి ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లోకి తీసుకురావాలని కోరారు. ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.విధుల నిర్వహణకు అవసరమైన సరైన ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించాలని, కంప్యూటర్ అలవెన్స్ మంజూరు చేయాలని, సెక్రటేరియల్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు. ఉద్యోగుల అవసరాలు, పని స్వభావం, బాధ్యతలను పరిగణనలోకి తీసుకొని తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సింగరేణిలో డిగ్రీలు, పీజీలు, ఇంజినీరింగ్‌, ఎంబీఏ వంటి ఉన్నత విద్యార్హతలు సాధించిన ఉద్యోగులకు వారి అర్హతలు, అనుభవానికి తగిన పోస్టింగులు, పదోన్నతులు కల్పించకపోవడం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొందని వంగ వెంకట్ అన్నారు. సంస్థకు 30 ఏళ్ల పాటు సేవలందించిన ఉద్యోగి సైతం క్లర్క్‌గానే పదవీ విరమణ చేయాల్సి రావడం ఏమిటని ప్రశ్నించారు.ఉద్యోగుల ప్రతిభను గుర్తించి, వారి విద్యార్హతలు, అనుభవానికి తగిన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. కోల్ ఇండియాలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి, అర్హతలకు అనుగుణంగా సింగరేణి ఉద్యోగులకు కూడా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. క్లరికల్ సిబ్బంది, పీఏలు, ఓఎస్‌లు తమ సమస్యలను బహిరంగంగా చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.ఉద్యోగులు, కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని వంగ వెంకట్ స్పష్టం చేశారు.సెక్రటేరియల్ సిబ్బంది పదోన్నతులు, క్యాడర్ స్కీమ్ సవరణ, ఖాళీల భర్తీ, పనిభారం తగ్గింపు, ఫర్నిచర్ సౌకర్యాలు, కంప్యూటర్ అలవెన్స్ తదితర సమస్యలపై త్వరలోనే సమగ్ర ప్రణాళికతో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు రావాలని, కార్మికవర్గంతో కలిసి హక్కుల సాధన ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం నిర్లక్ష్యం చేయకుండా సానుకూలంగా స్పందించి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.ఈ సదస్సులో ఏఐటీయూసీ కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్‌.వి. రమణమూర్తి, కార్పొరేట్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్‌, ఆఫీస్ బేరర్లు నాగయ్య, మల్లికార్జున్‌, మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే సికా నాయకులు నామా శ్రీనివాస్‌, రామ్‌సింగ్‌, రాజు, శ్యాం కిరణ్‌, సంజీవ్‌, రమణ, దివ్య, సౌజన్య తదితరులు హాజరయ్యారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొని సెక్రటేరియల్ సిబ్బంది సమస్యల పరిష్కారం, పదోన్నతుల విధానం, క్యాడర్ స్కీమ్ సవరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :