తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. జూలూరుపాడు మండలం వెంగన్న పాలెం గ్రామానికి చెందిన ఇంద్రపల్లి హరిణి (18) తన నివాస పరిస ప్రాంతంలో మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... వెంగ న్నపాలెం గ్రామానికి చెందిన ఇంద్రపల్లి సతీష్, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు సంతానం కాగా హరిణి, గ్రేస్ నర్సింగ్ కాలేజీ తనికెళ్ళలో ద్వితీయ సంవత్సరం హాస్టల్ లో వుంటూ చదువుతుతుంది. తండ్రి సతీష్ గత ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందగా, తల్లి రాజేశ్వరి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తె లను చదివించుకుంటూ వెంగన్నపాలెం గ్రామంలో నివాసం ఉంటు న్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల సుమారు తొమ్మిది రోజుల క్రితం హరిణి మేనత్త అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో మేనత్త కర్మలు బుధవారం జరగడంతో హరిణి హాస్టల్ నుండి వెంగనపాలెం గ్రామానికి వొచ్చింది. ఇదిలా ఉండగా మంగళవారం తల్లీ రాజేశ్వరి పనులు ముగించుకొని ఇంటికి రాగా కూతురు హరిణి ఎంతకీ కనిపించకపోవ డంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరిశీలించగా తన ఇంటి బాత్రూం వెనకాల అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గమ నించారు. మృతి దేహం పై గాయాలు ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. సంఘటనపై సమాచారం అందుకున్న జూలూరుపాడు సీఐ శ్రీ లక్ష్మి, ఎస్సై జీనత్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచా రణ చేపట్టారు. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్ప గించనున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా బాలిక ఒంటిపై గాయాలు తోపాటు బట్టలు లేకపోవడంతో, గుర్తుతెలియని వ్యక్తి బాలికను హత్య చేసి బాత్రూం వెనకాల పడేసి వెళ్లినట్లు ఆరోపణలు రాగా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ