Monday, 02 November 2026 07:00:22 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కొత్తగూడెంలో తొమ్మిది రోజుల పాటు ఘనంగా బతుకమ్మ సంబరాలు

Date : 08 October 2026 03:34 PM Views : 727

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు వేడుకలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి బతుకమ్మ సంబరాలు ఉత్తమ బతుకమ్మకు ప్రతిరోజూ పట్టుచీర బహుమతి – మరో నలుగురికి ప్రోత్సాహక బహుమతులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది కొత్తగూడెంలో తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రకటించింది. గత ఐదేళ్లుగా కొత్తగూడెం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను ఈ ఏడాది మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్టోబర్ 10, శనివారం నుంచి అక్టోబర్ 18, ఆదివారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో డా. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ డా. గడల శ్రీనివాసరావు పాల్గొననున్నారు. వేడుకల్లో భాగంగా ప్రతిరోజూ అత్యుత్తమంగా అలంకరించిన బతుకమ్మకు పట్టుచీరను ప్రథమ బహుమతిగా, మరో నలుగురు మహిళలకు ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నారు. బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు… తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, మన సంస్కృతికి నిలువెత్తు ప్రతీక. ఈ వేడుకల్లో కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమ వివరాలు * తేదీలు: అక్టోబర్ 10–18, 2026 * సమయం: ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి * వేదిక: జనసేన పార్టీ జిల్లా కార్యాలయం, హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ లైన్, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం. * సంప్రదించవలసిన నంబర్: 9701048341 రండి… బతుకమ్మ ఆడుదాం! మన తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ఘనంగా చాటుదాం!

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :