తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ పెద్దమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన ఫీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం ముగిసింది. దేవాదాయ శాఖ డివిజన్ పరిశీలకులు ఆనంద్, ఆలయ ఈవో విజయ్ కుమార్ పర్యవేక్షణలో 2 ఏసీ ఫంక్షన్ హాళ్లు, కొత్త షాపింగ్ కాంప్లెక్స్ లను మూడేళ్ల కాలానికి వేలం వేశారు.ఈ వేలంలో వీరభద్రం రూ.1,44,000, భవాని రూ.1,32,000, నాగలక్ష్మి రూ.1,62,200, శైలజ రూ.3,72,000 లకు దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ