Monday, 02 November 2026 06:15:28 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

కొత్తగూడెం ఏరియా భవిష్యత్తును కాపాడాలి.ఖాళీల భర్తీ, సర్ఫస్‌ కన్వర్షన్‌ వేగవంతం చేయాలి. ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య

Date : 25 October 2026 06:28 PM Views : 210

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా భవిష్యత్తును కాపాడాలి.ఖాళీల భర్తీ, సర్ఫస్‌ కన్వర్షన్‌ వేగవంతం చేయాలి ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్‌. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడంతోపాటు, కార్మికుల సమస్యలను పరిష్కరించి ఏరియా భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం సాయంత్రం కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో నిర్వహించిన ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వీకే కోల్‌మైన్‌లో పర్మినెంట్‌ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని, కార్మికుల హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉద్యమం చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.పీవీకే-5 భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్న జనరల్‌ అసిస్టెంట్ల సర్ఫస్‌ కన్వర్షన్‌ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టడం సరికాదని రంగయ్య అన్నారు. సీనియారిటీ ప్రకారం కన్వర్షన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏరియాలోని అన్ని సబ్‌కమిటీలను ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు.కొత్తగూడెం ఏరియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా నూతన గనుల ఏర్పాటుపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని రంగయ్య కోరారు.పెనగడప సమీపంలోని రాంపురం వద్ద ఇప్పటికే సర్వే నిర్వహించిన ప్రాంతంలో గని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమారు 300 అడుగుల లోతులో ఉన్న ఈ ప్రాంతం కోల్‌ గ్యాసిఫికేషన్‌కు అనుకూలంగా ఉందని పేర్కొంటూ, అక్కడ గనిని ప్రారంభించి ఏరియా భవిష్యత్తును కాపాడాలని కోరారు.అనిశెట్టిపల్లి, పునుకుదుచిలుక ప్రాంతాల్లోని బొగ్గు నిల్వలను సింగరేణి సంస్థ వెంటనే టేకప్‌ చేసి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కొత్తగూడెం ఏరియాలోనూ నెహ్రూ కాలనీల తరహాలో నివాస కాలనీలు నిర్మించాలని రంగయ్య కోరారు. కార్మికులకు సొంతింటి సౌకర్యం కల్పించడంతోపాటు ఖాళీల భర్తీ, ఉద్యోగ భద్రత, గనుల అభివృద్ధిపై యాజమాన్యం సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.సమ్మె నోటీసుకు సంబంధించి ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చల్లో అంగీకరించిన 24 డిమాండ్లను యాజమాన్యం త్వరితగతిన అమలు చేయాలని ఏరియా కార్యవర్గ సమావేశం డిమాండ్‌ చేశారు.కార్మిక సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపడతామని నాయకులు హెచ్చరించారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్‌ కార్యదర్శి జక్కుల గట్టయ్య, ఉపాధ్యక్షుడు కత్తర్ల రాములు, ఆఫీస్‌ బేరర్లు సందబోయిన శ్రీనివాస్‌, ఎస్‌. నాగేశ్వరరావు, హుమాయూన్‌, హీరాలాల్‌, గుమ్మడి వీరయ్య, కుర్ర రమేష్‌, పిట్‌ కార్యదర్శులు భూక్య రమేష్‌, మధు కృష్ణ, కమల్‌, మెంగన్‌ రవి, సురేందర్‌, సీనియర్‌ నాయకులు బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు, కోటి, సవాటీ స్వామి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :