Tuesday, 03 November 2026 09:21:54 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

పీహెచ్‌సీ సుజాతనగర్‌లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్.

Date : 24 September 2026 06:30 PM Views : 91

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పీహెచ్‌సీ సుజాతనగర్‌లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలు, మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా EDD క్యాలెండర్‌ను గత నెల, ప్రస్తుత నెల, రాబోయే నెలకు సంబంధించిన వివరాలతో మూడు నెలలపాటు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.ఫార్మసీ అధికారిని మందుల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ARV, AV, యాంటీ రేబీస్ వ్యాక్సిన్‌లు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ORS, జింక్ మాత్రలు తగినంతగా నిల్వ ఉంచాలని, కుటుంబ నియంత్రణ కార్నర్‌ను అవసరమైన సమాచారంతో సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.పీహెచ్‌సీలో పరిపాలనా, నివేదికల నిర్వహణ సక్రమంగా జరిగేలా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక సూపర్‌వైజరీ క్యాడర్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, మందులు మరియు వ్యాక్సిన్‌ల లభ్యత, రికార్డుల నిర్వహణ, నివేదికల సమర్పణలో ఎలాంటి లోపాలు లేకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు.ఈ తనిఖీలో డాక్టర్ బి. ప్రతాప్, పీఓ–సీహెచ్‌ఐ, మోహన్ డీపీఎంఓ, నాగభూషణం సీహెచ్‌ఓతో పాటు పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :