తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంకు చెందిన ప్రముఖ బంగారు నగల వ్యాపారవేత్త పసుమర్తి శ్రీనివాస్ హఠాన్ మరణం చెందారు. నగరంలోని గణేష్ టెంపుల్ ఏరియాకి చెందిన పసుమర్తి శ్రీనివాస్ నగరంలోని ఎంజీ రోడ్డులో గల ఎస్ కే ఆర్ జువెలరీస్, చిన్న బజార్ లో శ్రీనివాస జ్యువెలరీ నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం నగరంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు ఉన్న ఎస్కేఆర్ జువెలరీస్ అధినేత శ్రీనివాస్ అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. జిల్లాలో సుపరిచితులైన పసుమర్తి శ్రీనివాస్ మరణ వార్త అందరిలో దిగ్భ్రాంతిని నెలకొల్పింది.
Admin
తెలుగు వెలుగు టీవీ