Monday, 02 November 2026 05:31:53 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 01 November 2026 04:57 PM Views : 80

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది. ప్రజా ఉద్యమాలు నిర్మాణమే ఖాదర్ బాబుకు మనమిచ్చే నిజమైన నివాళి. కార్మిక, పేదల పక్షపాతిగా చెరగనిముద్ర వేసుకున్న బాబు అందరికీ ఆదర్శం.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.ఘనంగా ఉప్పుశెట్టి ఖాదర్ బాబు 9వ వర్దంతి.పేద ప్రజలు, కార్మికులో మమేకమై తన తుదిశ్వాస వరకు వారి అభ్యున్నతి కోసం శ్రమించిన ఉప్పుశెట్టి ఖాదర్ బాబు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సీపీఐ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమితి సభ్యులు, ప్రముఖ న్యాయవాది, మాజీ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఉప్పుశెట్టి ఖాదర్ బాబు 9వ వర్దంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాల్వంచలోని రాజీవ్ గాంధీ కూరగాయలు మార్కెట్ లో ఖాదర్ బాబు స్మారక స్థూపం వద్ద పార్టీ అరుణ పతకాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఖాదర్ బాబు అంచలంచలుగా జిల్లాస్థాయి నేతగా, పేదల నాయకుడిగా ఎదిగారని, సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం అనునిత్యం శ్రమించే వాడని, పాల్వంచ ప్రాంత ప్రజలను కమ్యూనిస్టు ఉద్యమాల వైపు మళ్లించి పార్టీ విస్తరణలో ప్రముఖ పాత్ర పోషించాడని కొనియాడారు. ఖాదర్ బాబు లేనిలోటు వ్యక్తిగతంగా తనకు బాధాకరమని బాబుతో ఉన్న స్మృతులను గుర్తుచేశారు. పాల్వంచ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధిగా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా పాల్వంచ ప్రాంతంలో చెరగని ముద్ర వేసుకున్న ఖాదర్ బాబు ఆశయాలను సాధించిన నాడే ఆయనకు ఘనమైన నివాళులర్పించిన వారు అవుతామని, నాయకులు కార్యకర్తలు ఈ బాధ్యతలు స్వీకరించి ఆయన ఆశయాలను సాధించాలని కోరారు. ఆయన ఉద్యమస్ఫూర్తిని కొనసాగిస్తూ నిత్యం ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్మించాలని తద్వారా పాల్వంచ ప్రాంతంలో సిపీఐని అగ్రస్థానంలో నేలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు AMC డైరెక్టర్ వాడే లక్ష్మీ, టీడీపీ నాయకులు కనగాల అనంతరములు, వర్తక సంఘం కన్వీనర్ చాలావాది ప్రకాష్, కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు వీ పద్మజ, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, ప్రజాసంఘాల నాయకులు శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి సునీల్ కుమార్, వైఎస్ గిరి, శెట్టి చేరాలు, ధరావత్ దినేష్, నామ పండు, నవీన్, కాకటి రవీందర్, ఆదినారాయణ, రవి, కిరణ్, నాగేశ్వరరావు, వెంకన్న, ప్రేమచంద్, ప్రశాంత్, వెంకన్న, రమేష్, కొమరయ్య, అల్లి వెంకటేశ్వర్లు, ఇరుకులపాటి సుధాకర్, అన్నారపు అశోక్, నాగ మల్ల సత్యనారాయణ, కృష్ణవేణి, దుర్గారావు, ఇరుకు రమేష్, అనిల్, అభిమానులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :