Monday, 02 November 2026 07:00:23 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Date : 27 October 2026 02:30 PM Views : 127

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : ఆదివాసీ హక్కుల సాధన కోసం పోరాడిన వీరుడు కొమరం భీమ్ ఆశయాలను కొనసాగిస్తూ, గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు మండల అభివృద్ధికి కృషి చేస్తామని కొమరం భీమ్ ఫౌండేషన్ నాయకులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కొమరం భీమ్ ఫౌండేషన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొమరం భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన పోరాటాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు కాలం నర్సింహారావు మాట్లాడుతూ, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అటవీ భూములపై హక్కుల సాధన కోసం కొమరం భీమ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆదివాసీ సమాజం విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ మండల కమిటీ ప్రతినిధి సొడె శ్రీరామ్ మాట్లాడుతూ, మండల కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల రవాణా సౌకర్యార్థం బస్‌స్టాండ్ నిర్మించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడంతో పాటు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1/70, పెసా చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి ఆదివాసీల హక్కుల పరిరక్షణకు 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని, పెసా చట్టం ప్రకారం గ్రామసభలకు కల్పించిన అధికారాలను సమర్థవంతంగా అమలు చేయాలని సొడె శ్రీరామ్ డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా ఐటీడీఏ ద్వారా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కొమరం భీమ్ ఫౌండేషన్ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సొడె శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. కొమరం భీమ్ ఆశయాల స్ఫూర్తితో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు, మండల ప్రజల సమస్యల పరిష్కారానికి ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతారం సర్పంచ్ కొర్సా రమేష్, ఇర్పా రామారావు, మడి రవి, ఈసం నరసింహారావు, వాడే నరసింహారావు, బచ్చల మహేష్, బచ్చల అశోక్ కుమార్, సామాజిక సద్భావన ప్రముఖ్ రామిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :