Wednesday, 04 November 2026 12:40:05 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పూర్తి అప్రమత్తతతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 08 October 2026 07:27 PM Views : 209

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓపీ సమయాలను కచ్చితంగా పాటించాలి. డ్యూటీ వైద్యులు అందుబాటులో ఉండాలి. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం వైద్యఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటు, ఓపీ సేవలు, అత్యవసర వైద్యం, గైనకాలజీ సేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాలు, సిబ్బంది అవసరాలపై సమీక్షించారు. ఆసుపత్రుల్లో నిర్ణయించిన ఓపీ సమయాలను కచ్చితంగా పాటించాలని, రోగులు వైద్యం కోసం వచ్చిన సమయంలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాత్రి సమయాల్లో కూడా అత్యవసర వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా డ్యూటీ వైద్యుల విధులను పర్యవేక్షించాలని తెలిపారు. విధి నిర్వహణలో అంతరాయం కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని ఆదేశించారు.పాల్వంచ, రామవరం, అశ్వారావుపేట, భద్రాచలం, బూర్గంపహాడ్ తదితర ప్రాంతాల్లో వైద్య సేవల పరిస్థితిని సమీక్షిస్తూ గైనకాలజీ వైద్యుల అందుబాటు, ప్రసూతి సేవలు, కేసుల భారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని బలోపేతం చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని, డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ తదితర అందుబాటులో ఉన్న నిధులతో అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాల పనులు, అదనపు పడకల సామర్థ్యం, అవసరమైన వైద్య పరికరాలపై కలెక్టర్ సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రుల్లో స్థలాభావం, వార్డుల నిర్వహణ, నర్సింగ్ సిబ్బంది అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.ఆసుపత్రుల పారిశుద్ధ్యం, వార్డుల పరిశుభ్రత, రోగులకు అందించే ఆహారం, ఆసుపత్రి పరిసరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. రోగులకు పరిశుభ్రమైన వాతావరణంతో పాటు నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, నర్సింగ్ సూపర్‌వైజర్లు తదితర సిబ్బందితో ఆసుపత్రుల సూపరింటెండెంట్లు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి విధి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రి నిర్వహణపై సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. సిబ్బంది మధ్య సమన్వయంతో సేవలను మరింత మెరుగుపరచాలని తెలిపారు.డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పరీక్షలు, మందులు, వైద్య సిబ్బంది అందుబాటును ముందుగానే నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సందర్భాల్లో మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు రిఫర్ చేసే విధానం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు.ఆసుపత్రులకు మంజూరైన పడకల సంఖ్య, నర్సింగ్ సిబ్బంది అవసరాలు, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలను సమీక్షించిన కలెక్టర్, అవసరమైన పోస్టుల భర్తీ, నర్సింగ్ సిబ్బంది బలోపేతం, ఆసుపత్రుల మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.ప్రజలకు అందించే ప్రతి వైద్య సేవలో నాణ్యత, సమయపాలన, బాధ్యతతో కూడిన సేవలు ఉండాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్లు తమ పరిధిలోని ఆసుపత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ రవిబాబు, జిల్లా ఏరియా ఆసుపత్రిల సూపర్డెంట్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :