Tuesday, 03 November 2026 11:33:31 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ఇందిరా ప్రియదర్శినిని సత్కరించి, అభినందించిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం మరియు TEAM కమిటీ సభ్యులు.

Date : 21 September 2026 08:06 PM Views : 173

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డు గ్రహీత, జూనియర్ న్యాయవాది ఇందిరా ప్రియదర్శినిని సత్కరించి, అభినందించినభారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం మరియు TEAM కమిటీ సభ్యులు.ఇందిరా ప్రియదర్శిని న్యాయవాద సేవలు అభినందనీయం! భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్!ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించి, అంకితభావం కృషి దీక్ష దక్షతలతో న్యాయవాద వృత్తిని చేపట్టి , ముఖ్యంగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, విశిష్టమైన న్యాయపరమైన సేవలు అందిస్తూ** న్యాయవాద వృత్తిలో అత్యంత ప్రతిభ కనబరుస్తూ, భారతరత్న అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మరియు మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న** ఇందిరా ప్రియదర్శిని సేవలు అభినందనీయమని, అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళోజి నంది అవార్డును స్వీకరించడం , వారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే గర్వకారణమని** భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్గాటించారు. 21 09 2026 నాడు స్థానిక చుంచుపల్లి లోని సంఘ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఇటీవల వరంగల్లోని కాళోజి ఆడిటోరియంలో ** సుప్రసిద్ధ ప్రజాకవి, సంఘసంస్కర్త ,స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ కాళోజి జయంతి సందర్భంగా ఉత్తమ ప్రతిభతో , విశిష్ట న్యాయవాద సేవలను అందిస్తున్నందుకుగాను * స్థానిక ఫ్యూన్ బస్తీకి చెందిన ప్రముఖ అంబేద్కర్ వాది మరియు సామాజిక వాది ఉల్లోజు వెంకట్ సతీమణి, జూనియర్ న్యాయవాది శ్రీమతి పి ఇందిరా ప్రియదర్శిని హైకోర్టు జడ్జి గారి చేతుల మీదుగా** బెస్ట్ జూనియర్ అడ్వకేట్ తో పాటు, ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డును కూడా స్వీకరించడం పట్ల హర్షం ప్రకటిస్తూ భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం మరియు TEAM కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి, అభినందించి మెమొంటోను బహుకరించారు.ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ,సన్మాన గ్రహీత పి ఇందిరా ప్రియదర్శిని ఆమె భర్త ఉల్లోజు వెంకట్ లతో బాటు TEAM కమిటీ రాష్ట్ర కన్వీనర్, ప్రముఖ అంబేద్కర్ వాది దాసరి రమేష్,TEAM రాష్ట్ర గౌరవ సలహాదారులు రిటైర్డ్ సింగరేణి జిఎం శనగ వెంకటేశ్వర్లు, బరగడి దేవదానం గారు, కో కన్వీనర్లు శెట్టి కమలాకర్ , బూర్గుల కరుణాకర్,కోర్ కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశ్వర్లు తలారి కిషోర్ బాబు, అంబేద్కర్ సంఘం నాయకులు దేవదాసు ,రాజేశ్వరరావు, శివ లు పాల్గొన్నారు.భారతరత్న అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి!

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :