తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డ్రైనేజీలు, విద్యుత్ సమస్యల పరిష్కారం.కాలనీల్లో పారిశుద్ధ్య పనుల వేగవంతంగా చేపడుతున్నాం.ముమ్మరంగా రహదారి విస్తరణ, విద్యుద్దీకరణ పనులు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిశీలించి పరిస్కరిస్తున్నాం. కొత్తగూడెం నగర పాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్. నగర పరిధిలోని అన్ని కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా చర్యలు చేపడుతున్నామని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ స్పష్టం చేశారు. పాల్వంచలోని కాంట్రాక్టర్స్ కాలనీ, బాపూజీ నగర్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, పిచ్చిమొక్కల తొలగింపు తదితర సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులపై మంగళవారం ఆయన స్వయంగా స్పందించారు. భద్రాచలం రోడ్డు నుంచి నాలుగు డివిజన్లకు వెళ్లే ప్రధాన రహదారిలో నెలకొన్న సమస్యల పరిష్కార నిమిత్తం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై అంధకారం నెలకొనకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసి తక్షణమే 11 విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ చర్యలతో 7వ, 42వ డివిజన్లు సహా పరిసర ప్రాంతాల ప్రజలకు శాశ్వత ఉపశమనం కలగనుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ