తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న తమ ప్రియమైన గురువు, ప్రిన్సిపల్ డా. ఎన్.వి.కె. ప్రసాద్ కు వనజీవి, ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ప్రిన్సిపల్ తో కలిసి నవభారత్ పాఠశాల ఆవరణలో తన యజ్ఞంలో భాగంగా 1610వ మొక్కగా పింక్ పనస మొక్కను నాటారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బొకేలు కేకులకు బదులుగా ప్రకృతికి మేలు చేసే మొక్కను బహూకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గురువుకు ఇచ్చే గౌరవం మొక్క రూపంలో ఉంటే అది తరతరాలకు గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా విశ్వామిత్ర చౌహాన్ తెలిపారు.వాక్ ఫర్ ట్రీస్ యజ్ఞం తరఫున ఆయన చేస్తున్న ఈ పర్యావరణ సేవలను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ