Monday, 02 November 2026 09:57:21 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

Date : 22 October 2026 04:31 PM Views : 81

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేద ప్రజల పక్షాన నిలిచి ఆధిపత్య వర్గాలపై పోరాడిన వీరుడు పండుగ సాయన్న : కలెక్టరేట్ పరిపాలనాధికారి అనంత రామకృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ పరిపాలనాధికారి అనంత రామకృష్ణ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పండుగ సాయన్న జీవిత విశేషాలను, ఆయన ప్రజాసేవను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అనంత రామకృష్ణ మాట్లాడుతూ, పండుగ సాయన్న జీవితం, ఆయన పోరాట పటిమ, పేద ప్రజల పట్ల చూపిన ఆదరణ భావితరాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాలు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలు, అణచివేతలకు వ్యతిరేకంగా నిలిచి పోరాడిన వ్యక్తిగా పండుగ సాయన్నకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు . ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారి సంక్షేమం కోసం తన శక్తిని, సామర్థ్యాన్ని వినియోగించిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. మహబూబ్‌నగర్ సమీపంలోని నవాబ్‌పేట మండలం మేరుగోనిపల్లె గ్రామానికి చెందిన పండుగ సాయన్న చిన్ననాటి నుంచే గ్రామీణ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచేవారని తెలిపారు. సుమారు 20 కిలోల గుండును ఒక చేత్తో అవలీలగా ఎత్తడంతో పాటు, ఎద్దుల బండిని సైతం ఒక చేత్తో ఎత్తి విసిరే అసాధారణ శారీరక సామర్థ్యం ఆయనకు ఉండేదని వివరించారు. శారీరక బలం, ధైర్యసాహసాలతో పాటు ప్రజల పట్ల సేవాభావం ఆయనలో ప్రత్యేకంగా ఉండేవని తెలిపారు . ఆ కాలంలో పేద ప్రజలు ఆకలి, పేదరికం, సామాజిక అణచివేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో పండుగ సాయన్న వారికి అండగా నిలిచారని తెలిపారు. ఆకలితో అలమటించే ప్రజలకు ఆహారం అందించేందుకు సంపన్నుల ఇళ్లలోని ధాన్యపు గోదాముల నుంచి ధాన్యాన్ని తీసుకువచ్చి పేదలకు పంచిపెట్టేవారని తెలిపారు . ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, దొరల ఆధిపత్యం, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించారని వివరించారు. ఇందుకోసం తనకంటూ ఒక దళాన్ని ఏర్పాటు చేసుకుని, ఆయుధాలను సమకూర్చుకుని ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. చరిత్రలో ప్రజల కోసం పోరాడిన మహనీయుల జీవితాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు . సమాజంలో సమానత్వం, న్యాయం, మానవత్వం, సేవాభావం వంటి విలువలను పెంపొందించుకోవడానికి పండుగ సాయన్న జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సమాజంలోని పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిని విజయలక్ష్మి, బీసీ కమ్యూనిటీ సంఘ నాయకులు సాప్పరి క్రాంతి, బండారి సాగర్, అక్కల మధు, అక్కల సీతారామయ్య, కె. పైడయ్య, ఊదర వెంకటస్వామి, శ్రీనివాస్, ఎ. రాంబాబు, పి. వినయ్, కె. సమ్మయ్య, ఎన్. యాకయ్య, ఎ. సోమయ్య, హారిక, ఉషారాణి, జి. సంధ్యారాణి, ముదరుకోళ్ళ కిషోర్ తదితరులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :