Tuesday, 03 November 2026 08:41:09 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

గిరిజన గర్భిణులకు వరంగా చర్ల సీ హెచ్ సి - నెలకు 3 నుంచి 50కి చేరిన ప్రసవాల సంఖ్య .

Date : 01 October 2026 08:46 PM Views : 151

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన గర్భిణులకు వరంగా చర్ల సీ హెచ్ సి.నెలకు 3 నుంచి 50కి చేరిన ప్రసవాల సంఖ్య. హైరిస్క్ కేసులు సైతం అక్కడే చికిత్స.. నార్మల్ డెలివరీలు ఎక్కువే.56 కి.మీ. దూరంలోని భద్రాచలానికి రిఫరల్స్ తగ్గిస్తూ గోల్డెన్ అవర్స్‌లోనే అత్యవసర వైద్యం.జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక దృష్టి .మారుమూల గిరిజన ప్రాంతమైన చర్లలో మాతా శిశు వైద్య సేవలు గణనీయంగా బలోపేతం అవుతున్నాయి. గతంలో నెలకు సగటున 3–4 ప్రసవాలు మాత్రమే జరిగే చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం నెలకు సుమారు 50 ప్రసవాలు జరిగే స్థాయికి సేవలు విస్తరించాయి. దీంతో గర్భిణులు అత్యవసర సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతూ, తమకు సమీపంలోనే సురక్షితమైన ప్రసూతి సేవలు పొందుతున్నారు.గత నెల సెప్టెంబర్ మాసం లో చర్ల CHCలో 46 ప్రసవాలు జరిగాయి. వీటిలో 30 సాధారణ ప్రసవాలు, 16 సిజేరియన్ ప్రసవాలు ఉన్నాయి. వీటితో పాటు 8 హైరిస్క్ ప్రసూతి కేసులకు సకాలంలో అవసరమైన వైద్య సేవలు అందించారు. వీటిలో 4 ప్రీ-ఎక్లాంప్సియా, ఒక ఎక్లాంప్సియా, ఒక అబ్రప్షియో ప్లాసెంటా, ఒక గ్రాండ్ మల్టీపారా, ఒక అబ్స్ట్రక్టెడ్ లేబర్ కేసులు ఉన్నాయి.గోల్డెన్ అవర్స్‌లో చికిత్స.. తల్లి, శిశువులకు భరోసా చర్ల నుంచి భద్రాచలం సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, ప్రసూతి అత్యవసర పరిస్థితుల్లో రవాణా సమయం అత్యంత కీలకంగా మారుతుంది. ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులను అత్యవసర సమయంలో దూరంలోని ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం తగ్గి, చర్లలోనే అవసరమైన ప్రసూతి, సిజేరియన్ సేవలు అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరంగా మారింది.అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్స్‌లోనే వైద్య సేవలు అందించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు, తల్లి మరియు శిశువుల ప్రాణాలను కాపాడే అవకాశాలను మెరుగుపరచవచ్చు. స్థానికంగా సమగ్ర ప్రసూతి సేవలు అందుబాటులో ఉండటం మాతా, శిశు మరణాల నివారణలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.TIFFA, ANC స్కానింగ్ సేవలు కూడా అందుబాటులోకిచర్ల CHCలో ప్రసూతి సేవలను మరింత సమగ్రంగా అందించేందుకు TIFFA స్కాన్, ANC స్కాన్ సేవలు కూడా కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో గర్భిణులు అవసరమైన యాంటీనేటల్ పరీక్షలు, స్కానింగ్ సేవలను స్థానికంగానే పొందే అవకాశం ఏర్పడింది.ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్, ఒక అనస్థీషియాలజిస్ట్‌తో నిరంతర సేవలు.ప్రస్తుతం చర్ల CHCలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక గైనకాలజిస్ట్, ఒక అనస్థీషియాలజిస్ట్, అలాగే రెగ్యులర్ ప్రాతిపదికన ఒక పీడియాట్రిషియన్ అందుబాటులో ఉన్నారు.పరిమిత వైద్య వనరుల మధ్య కూడా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమన్వయంతో సాధారణ ప్రసవాలు, సిజేరియన్లు, ట్యూబెక్టమీతో పాటు హైరిస్క్ కేసులకు సేవలు అందిస్తున్నారు. బృంద సమన్వయం, నిరంతర పర్యవేక్షణతో చర్ల CHCలో ప్రసూతి సేవలు మరింత బలోపేతం అవుతున్నాయి.కలెక్టర్ అంకిత్ సహకారంతో మౌలిక వసతుల బలోపేతం చర్ల వంటి మారుమూల గిరిజన ప్రాంతంలో వైద్య సేవలను బలోపేతం చేయడంలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అందిస్తున్న సహకారం కీలకంగా ఉంది. వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక వసతులు, నర్సింగ్ సిబ్బంది తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.జిల్లా వైద్య సేవల సమన్వయంలో DCHS డా. G. రవి బాబు నిరంతర పర్యవేక్షణ, CHC సూపరింటెండెంట్ డా. సాయి వర్ధన్ ఆధ్వర్యంలోని వైద్య, నర్సింగ్ సిబ్బంది సమిష్టి కృషి చర్లలో ప్రసూతి సేవల విస్తరణకు దోహదపడింది.ప్రభుత్వ వైద్య సేవలపై పెరుగుతున్న నమ్మకం చర్లలో ప్రసూతి సేవలు బలోపేతం కావడంతో మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు తమ ప్రాంతానికి సమీపంలోనే సురక్షితమైన, సమయానుకూలమైన, నాణ్యమైన మాతా శిశు వైద్య సేవలు అందుతున్నాయి.ప్రసవాల సంఖ్య పెరగడం మాత్రమే కాకుండా, హైరిస్క్ కేసుల నిర్వహణ, సిజేరియన్ సేవలు, ట్యూబెక్టమీ, TIFFA మరియు ANC స్కానింగ్ సేవలు స్థానికంగా అందుబాటులోకి రావడం వల్ల చర్ల CHC మాతా శిశు ఆరోగ్య సేవలకు ముఖ్యమైన కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. దూరం తగ్గింది.. వైద్య భరోసా పెరిగింది” అన్నట్లుగా, చర్లలో బలోపేతమైన ప్రసూతి సేవలు గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి.సేవలపై మంత్రి పొంగులేటి, ఎంఎల్ఏ తెల్లం ప్రశంస ఈటీవలే 30 పడకల చర్ల ఆసుపత్రి భవనం నిర్మాణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఈ మారుమూల ప్రాంతంలో చర్ల ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలను స్థానిక శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట రావు ద్వారా తెలుసుకొని సిబ్బంది ని అభినందిస్తూ సేవలను పలు వేదికల్లో కొనియాడారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :