తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ములకలపల్లి మండలం కమలాపురం ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్యాహ్న భోజన ఏర్పాట్లను, వంటశాలను, స్టోర్ రూమ్‌లోని నిత్యావసరాల నాణ్యతను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజన నాణ్యత, రుచి, మెనూ అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, వంటశాల పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, పాఠశాలలో మూలనపడిన ఆర్ఓ ప్లాంట్‌కు వెంటనే మరమ్మతులు చేయించి, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట తహసీల్దార్ స్వాతి బిందు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ