తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీరులకు మోడ్రన్ ఇఖ్రా స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల ఘన నివాళి. ఈ సందర్భంగా కొత్తగూడెం కార్పోరేషన్ సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం 12 వ వార్డు లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ మాట్లాడుతూ మీ ప్రశాంతమైన జీవితం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడానికి! మన రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించడానికి! ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం అని ఈ సందర్భంగా తెలంగాణ పోలీసుల సేవలను, వారి త్యాగాలను, వారి కుటుంబాల బాధలను, సమాజం పట్ల వారి బాధ్యతలను మననం చేసుకోవడం మనందరి కర్తవ్యం. ఖాకీ దుస్తుల వెనుక ఉన్న త్యాగం ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ప్రజలంతా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మీ వీధుల్లో గస్తీ తిరుగేది పోలీసులు అన్నారు. మీరంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగలు జరుపుకుంటున్నప్పుడు మీ భద్రత కోసం విధులు నిర్వహించే పోలీసులను అందరూ గుర్తించాలి అన్నారు. భారీ వర్షాలు, వరదలు, ప్రమాదాలు జరిగినప్పుడు మిముల్ని రక్షించడానికి ముందుకు వచ్చే వారే పోలీసులు! పోలీసు అంటే కేవలం ఖాకీ దుస్తులు ధరించిన వ్యక్తి కాదు. ఆ ఖాకీ దుస్తుల వెనుక ఒక మనసుంది. ఆ మనసులో ఒక కుటుంబముంది. ఆ కుటుంబంలో తన రాక కోసం ఎదురుచూసే తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఉన్నారు. అయినా వ్యక్తిగత సుఖాలకంటే ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహించే అవసరమైతే సమాజం కోసం తన ప్రాణాలను కూడా త్యాగం చేసేవాడు పోలీసు అమరవీరుడు. తెలంగాణ పోలీసుల సేవలు అలాగే మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో బాధితులకు సహాయం అందించడానికి ప్రత్యేక పోలీసు విభాగం షీ టీం కూడా, సహాయక వ్యవస్థలు ఉన్నాయి. ఒక మహిళ భయం లేకుండా బయటకు వెళ్లగలిగినప్పుడే సమాజంలో నిజమైన స్వేచ్ఛ ఉన్నట్లు భావించాలి. మహిళల గౌరవాన్ని కాపాడటం అంటే సమాజ గౌరవాన్ని కాపాడటమే. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల సేవలు రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతో రహదారి భద్రత ఒక పెద్ద సవాలుగా మారింది. ట్రాఫిక్ పోలీసులు మండుటెండల్లోనూ, వర్షాల్లోనూ రహదారులపై నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా పోలీసుల కృషికి సహకరించాలి అన్నారు స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ పండుగలు, ఉత్సవాల్లో పోలీసుల త్యాగం దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్, బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను ప్రజలు మనం మన కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. కానీ అదే సమయంలో పోలీసులు ప్రజల భద్రత కోసం బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంటారు. ఒకవైపు ప్రజలు కుటుంబ సభ్యులతో పండుగలు జరుపుకుంటుంటే, మరోవైపు పోలీసులు తమ కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఇది వారి వృత్తిలోని బాధ్యతను, వ్యక్తిగత త్యాగాన్ని తెలియజేస్తుంది. “మన ఆనందాల వెనుక కనిపించని కాపలా – పోలీసుల విధి నిర్వహణ.” అలాంటి పోలీసులను గౌరవించాలని ప్రజలు చట్టాలను గౌరవించాలి. నేరాల గురించి తెలిసినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలి. తప్పుడు వార్తలను ప్రచారం చేయకూడదు. ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అదే విధంగా పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి. ప్రజల విశ్వాసమే పోలీసు వ్యవస్థకు నిజమైన బలం అని విద్యార్థులకు తెలియజేశారు. పోలీసుల సేవలకు మనస్ఫూర్తిగా వందనం ఒక మంచి సమాజ నిర్మాణానికి విద్య ఎంత అవసరమో, వైద్యం ఎంత అవసరమో, న్యాయం ఎంత అవసరమో, శాంతిభద్రతలు కూడా అంతే అవసరం. ఆ శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యతను భుజాన వేసుకున్న పోలీసుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి అని కూడా అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు తెలంగాణ పోలీసుల సేవలకు హృదయపూర్వక అభినందనలు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు
Admin
తెలుగు వెలుగు టీవీ