Monday, 02 November 2026 06:15:26 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి.

Date : 17 October 2026 06:15 PM Views : 102

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులైన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలి.ఎన్నికల అధికారుల సమన్వయంతో ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌ఓలు), సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్‌ఓలు), ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఏఈఆర్‌ఓలు తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), సూపర్‌వైజర్లతో సమన్వయం చేసుకుంటూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగేందుకు సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, అనర్హుల వివరాలు జాబితాలో లేకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బూత్ స్థాయి అధికారుల సమన్వయంతో ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్ల నుంచి సేకరించిన ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరిష్కార ప్రక్రియను చేపడుతున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా, ఓటరు జాబితాలో వివరాల సవరణలు నిబంధనల ప్రకారం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :