తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి న్యాయస్థానం రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన టేకులపల్లి మండలం వెంకట్య తండాకు చెందిన జార్పుల రమేష్ , సులానగర్‌కు చెందిన గుగులోతు రమేష్ , రాంపూర్‌కు చెందిన గుగులోతు సాయి కుమార్ లపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులను విచారించిన కొత్తగూడెం రెండో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ముగ్గురు నిందితులకు రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల భద్రత దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ