Monday, 02 November 2026 05:32:43 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి. పారిశుధ్య పనులను ముమ్మరం చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా.

Date : 28 October 2026 06:28 PM Views : 89

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? తుఫాను నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి.పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి.పాత ఇండ్లు, గుడిసెవాసులు జాగ్రత్తలు పాటించాలి. బస్తీలు, గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.పారిశుధ్య పనులను ముమ్మరం చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా.'అర్ణబ్' తుఫాను ప్రభావంతో పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలకు ప్రభుత్వం వెంటనే తగిన పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. తుఫాను తాకిడితో ప్రజలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్'లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తక్షణమే పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని కోరారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు తుఫాను పాలై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఒక్కో ఎకరానికి ప్రభుత్వమే నేరుగా నష్టపరిహారం చెల్లించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నందున పాత ఇళ్లలో నివసిస్తున్నవారు, గుడిసెవాసులు అప్రమత్తంగా ఉంటూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం, గ్రామ పంచాయతీల అధికారులు స్థానికంగా పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని కోరారు. వీధుల్లో నీరు నిల్వకుండా చూడాలని, వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించి బస్తీలు, గ్రామాల్లో తక్షణమే ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బాధితులకు అవసరమైన మందులు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :