తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని అశోక్ నగర్ 3వ వార్డు లో యువత ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ గణపతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అనంతరం ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.నవరాత్రి పూజలతో పాటు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన కార్యమని కొనియాడారు.నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానానికి ప్రత్యేక విశిష్టత ఉందని ఇంతటి గొప్ప కార్యాన్ని విజయవంతం చేసిన కమిటీ సభ్యులను,దాతలను అభినందిస్తున్నానని అన్నారు.అన్నదాన కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.గణపతి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఐక్యత,సోదర భావం,సేవ దృక్పథాన్ని పెంపొందించేందుకు దోహద పడతాయని తెలిపారు.యువత ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ