Tuesday, 03 November 2026 12:52:05 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

జాతిపిత గాంధీ సిద్ధాంతాలు సమాజానికి మార్గదర్శకం : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 02 October 2026 12:54 PM Views : 141

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సత్యం, అహింస, శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనించాలి జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల్లో అగ్రగణ్యుడైన మహాత్మా గాంధీజీ సత్యాగ్రహం, అహింసాయుత పోరాటం ద్వారా భారతదేశ స్వాతంత్ర్య సాధనకు మార్గం సుగమం చేశారని తెలిపారు. గాంధీజీ చూపిన ఆలోచనలు, సిద్ధాంతాలు కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు . గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరిస్తే సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని అన్నారు. గాంధీజీ బోధనలు నేటి యువతకు ఎంతో ప్రేరణనిస్తాయని కలెక్టర్ అన్నారు . క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. తమ వృత్తి, వ్యక్తిగత జీవితం, సామాజిక బాధ్యతల్లో గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా భావించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజాసేవలో పారదర్శకత, జవాబుదారీతనం, మానవతా విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గాంధీజీ జీవితం, ఆయన ఆచరించిన విలువలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువత గాంధీజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సీపీఓ సునీత, కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి అనూష, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :