తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఓఎస్డీ కార్యాలయాల్లో పునరుద్ధరించిన నూతన నిర్మాణాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రారంభించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో డాగ్ కెన్నెల్, బీడీ టీమ్ రూమ్, మెన్ బ్యారక్స్, నూతన పార్కింగ్ షెడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ఓఎస్డీ కార్యాలయంలో ఆపరేషన్ ఆర్ఐ గదిని, బ్యారక్స్‌ను ప్రారంభించి సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగంగా పూర్తి చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ