తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 1600 రోజులుగా అవిశ్రాంతంగా మొక్కలు నాటుతున్న వనజీవి విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రశంసించారు.వాక్ ఫర్ ట్రీస్ అనే మహా యజ్ఞంలో భాగంగా ఐడిఓసి కార్యాలయం ఆవరణంలో 1600వ రోజు 1600 మొక్కగా పింక్ పనస మొక్కను జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి నాటారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం ఎలా ఉన్నా క్రమం తప్పకుండా ప్రతిరోజూ మొక్కలు నాటడం కష్టతరమైన విషయమని ఒక కఠోర దీక్ష అని ఆయన అన్నారు చిన్న వయసులోనే ఇంతటి పట్టుదలతో పర్యావరణం కోసం పనిచేయడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు చిన్న వయసులో సామాజిక స్పృహ కలిగి సమాజానికి ప్రాణవాయువును అందించాలనే తపన విశ్వామిత్ర చౌహాన్ లో కనిపిస్తోందని చౌహాన్ ను చూస్తుంటే భవిష్యత్తులో కోట్లాది మొక్కలు నాటి భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిస్తాడని బలంగా ఆశిస్తున్నాను అని అన్నారు.పర్యావరణ సమతుల్యతకు ప్రాణికోటి మనుగడకు మొక్కల ఆవశ్యకత ఎంతో ఉందని విశ్వామిత్ర ఇచ్చిన ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.చౌహాన్ భవిష్యత్తులో మరిన్ని మొక్కలు నాటి పచ్చని భారతం కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలుపుతూ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ