తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ రామవరం బౌద్ధ గుహల వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో, జిల్లా పర్యాటక నోడల్ అధికారి బి. అనూష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మరియు DRDO శ్రీమతి ఎం. విద్యా చందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కారుకొండ రామవరం సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు లక్ష్మీదేవిపల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధ్యతాయుతమైన పర్యాటకం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, సుస్థిర పర్యాటకం ప్రాధాన్యతను ప్రధానంగా వివరించారు. కారుకొండ రామవరం బౌద్ధ గుహలు మరియు అక్కడి బౌద్ధ సాంస్కృతిక నిర్మాణాల చారిత్రక ప్రాధాన్యత, వాటి పరిరక్షణ ఆవశ్యకతపై బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు అవగాహన కల్పించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. విద్యార్థులలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణహిత జీవన విధానం మరియు బాధ్యతాయుత ప్రవర్తనపై అవగాహన కల్పించేలా స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా, పర్యావరణహితంగా ఉంచడంలో విద్యార్థులు మరియు యువత భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా వివరించారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు భద్రత, మార్గదర్శకత్వం అందిస్తూ పర్యాటక రంగ అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తున్న టూరిజం పోలీసులను జిల్లా పర్యాటక నోడల్ అధికారి బి. అనూష ఘనంగా సత్కరించి, వారి అంకితభావాన్ని అభినందించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలన్నింటినీ బాధ్యతాయుతమైన, పర్యావరణహితమైన మరియు సుస్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా నిర్వహించారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను కాపాడుతూ, పరిశుభ్రతను పాటిస్తూ, స్థానిక సమాజ భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ