తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తుఫానులోనూ ఆగని మొక్కల యజ్ఞం.. మొక్కలు నాటిన వనజీవి విశ్వామిత్ర చౌహాన్.ఎండా వానా తుఫాను లెక్కచేయని ప్రకృతి ప్రేమికుడు వాక్ ఫర్ ట్రీస్ తో నిత్యం మొక్కల పండగ.పాల్వంచ తుఫాను ప్రభావంతో జిల్లా అంతా అప్రమత్తంగా ఉన్న వేళ.. ఒక ప్రకృతి ప్రేమికుడి మొక్కల యజ్ఞం మాత్రం ఆగలేదు. ఎలాంటి సందర్భమైనా వర్షం పడ్డా ఎండ కాసినా తుఫాను వచ్చినా ప్రతిరోజూ మొక్కలు నాటడమే లక్ష్యంగా సాగుతున్న వాక్ ఫర్ ట్రీస్ యజ్ఞం లో భాగంగా వనజీవి విశ్వామిత్ర చౌహాన్ మరో మైలురాయిని అందుకున్నారు కొత్తగూడెం నగర పాలక సంస్థ మేయర్ మూడ్ గణేష్ కమిషనర్ కోడూరు సుజాత తో కలిసి పాల్వంచ మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో 1609వ మొక్కగా పెద్ద నేరేడు మొక్కను నాటారు.తుఫాను నేపథ్యంలో కూడా మొక్కలు నాటడం పట్ల అందరూ అభినందనలు తెలిపారు చెట్టు ఉంటేనే భవిష్యత్తులో ఇలాంటి తుఫానుల తీవ్రత తగ్గుతుంది పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని విశ్వామిత్ర చౌహాన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ విజయానంద్ శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ