తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గాంధీ జయంతిని పురస్కరించుకొని ఐ డి ఓ సి కార్యాలయ ఆవరణంలో వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ లో భాగంగా ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ తన 1583వ మొక్క అయిన పనస మొక్కను జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ భూషిత్ తో కలిసి నాటారు.అనంతరం DTO శ్రీ భూషిత్ మాట్లాడుతూ..."జాతిపిత మహాత్మా గాంధీ గారు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. సత్యం, అహింస, స్వచ్ఛత అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీజీ. ఆయన ఆశయాలు, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శప్రాయం.నేడు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న వేళ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ఎంతో అవసరం. మొక్కలే మనకు ప్రాణవాయువును ఇస్తాయి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. మొక్కలు నాటడం అనేది ఒక సామాజిక బాధ్యత.ఇలాంటి తరుణంలో చిన్న వయస్సు నుండే ప్రతిరోజూ మొక్కలు నాటుతూ, అందరూ మొక్కలు నాటాలని పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటుతూ, 1583 రోజులుగా మొక్కలు నాటుతున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అని అన్నారువాక్ ఫర్ ట్రీస్ పేరుతో చౌహాన్ చేస్తున్న కృషి అద్భుతం. చౌహాన్ పట్టుదల, ప్రకృతి పట్ల ప్రేమ చూస్తుంటే రేపటి తరానికి ఆశ కలుగుతోంది. భవిష్యత్తులో కూడా ఇలానే పచ్చదనం కోసం కృషి చేయాలని, చౌహాన్ లాంటి వారు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను" అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ