Wednesday, 04 November 2026 01:20:37 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి : డీఆర్వో పద్మావతి

Date : 08 October 2026 06:54 PM Views : 138

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హిట్‌ అండ్‌ రన్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలి.జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి సూచించారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, హిట్‌ అండ్‌ రన్‌ కేసుల పరిష్కారం, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.జిల్లాలో 2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు మొత్తం 370 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, వీటిలో 164 ప్రమాదాలు ప్రాణాంతకమైనవిగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రమాదాల్లో 176 మంది మృతి చెందగా, 23 మంది తీవ్రంగా, 344 మంది స్వల్పంగా గాయపడినట్లు వివరించారు. నమోదైన 370 ప్రమాదాల్లో 369 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 99.4 శాతం కేసుల్లో చర్యలు చేపట్టినట్లు తెలిపారు.రహదారుల వారీగా ప్రమాదాల వివరాలను పరిశీలిస్తూ రాష్ట్ర రహదారులపై 79, ప్రధాన జిల్లా రహదారులపై 4, ఇతర జిల్లా రహదారులపై 32, జాతీయ రహదారులపై 67 ప్రమాదాలు జరిగినట్లు అధికారులు వివరించారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వాటికి గల కారణాలను విశ్లేషించి, సంబంధిత రహదారి సంస్థల ద్వారా అవసరమైన భద్రతా చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను ప్రాధాన్యతతో చేపట్టాలని, ప్రమాదాలకు కారణమవుతున్న మలుపులు, బ్లాక్‌స్పాట్లు, రహదారి లోపాలను గుర్తించి సకాలంలో సరిచేయాలని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రోడ్‌ మార్కింగ్‌లు, వీధి దీపాలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.హిట్‌ అండ్‌ రన్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 7 కేసులను సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని వినియోగించి త్వరితగతిన ఛేదించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి ప్రాణాంతక ప్రమాదానికి సంబంధించి కారణాలను విశ్లేషించి, సంబంధిత రహదారి సంస్థలు మరియు రవాణా శాఖకు అవసరమైన సమాచారం అందించి పునరావృత ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.పోలీస్‌, రవాణా, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, జాతీయ రహదారుల శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రమాదాల నివారణకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని డీఆర్వో పద్మావతి ఆదేశించారు. రహదారి భద్రతా ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రమాదాలపై విశ్లేషణ ఆధారంగా అవసరమైన శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సమీక్షలో జిల్లా రవాణా అధికారి భూషిత్‌ రెడ్డి, డీఆర్‌ఎం జి. బాలాజీ, డీహెచ్‌ఎంఓ తుకారాం రాతోడ్ , ఆర్‌అండ్‌బీ ఈఈ, ట్రాఫిక్‌ ఎస్‌ఐ, సీ సెక్షన్‌ సిబ్బంది సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :