Wednesday, 04 November 2026 01:44:00 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి. ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 28 September 2026 06:24 PM Views : 143

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజల నుంచి స్వీకరించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, ఉపాధి, పింఛన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపేందుకు ప్రజావాణి కార్యక్రమం కీలక వేదికగా పనిచేస్తుందన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు.తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని ఎంపీడీఓ కార్యాలయాల్లోనే వినతులు సమర్పించి, స్థానిక స్థాయిలో సమస్యల పరిష్కారం పొందవచ్చన్నారు. వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పించడం ద్వారా సమస్యల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయవచ్చని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని వినతులు: పాల్వంచ మండలం బసవతారక కాలనీకి చెందిన బానోతు వీరు నాయక్, సోములగూడెం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 62/85లోని 5.31 కుంటల వ్యవసాయ భూమికి విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ఎన్‌ఓసీ సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ వినతి సమర్పించారు. పట్టా లేని కారణంగా ఎన్‌ఓసీ జారీ చేయడం లేదని, తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పటికీ జాప్యం జరుగుతోందని వివరించారు. ఈ వినతిని పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో, విద్యుత్ శాఖ అధికారులకు కలెక్టర్ ఎండార్స్ చేశారు.అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు గ్రామానికి చెందిన బొక్క అనసూర్య, తన కుమార్తె మొదటి కాన్పు ఆర్థిక సహాయం కోసం జిల్లా కార్మిక శాఖలో దరఖాస్తు చేసి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు క్లెయిమ్ మొత్తం ఖాతాలో జమ కాలేదని తెలిపారు . తనకు రావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ సమర్పించిన వినతిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన వడ్లనపు లత, డిగ్రీ వరకు చదివిన తనకు అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వయస్సు కొన్ని నెలలు అధికంగా ఉందనే కారణంతో దరఖాస్తును నిరాకరిస్తున్నారని తెలిపారు. తన దరఖాస్తును మరోసారి పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ సమర్పించిన వినతిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.మణుగూరు మండలం ఆర్లపురం గ్రామానికి చెందిన తాటి వెంకటమ్మ, సర్వే నంబర్ 17లోని 1.20 కుంటల భూమి సింగరేణి ఓపెన్‌కాస్ట్ పరిధిలో కోల్పోతున్నానని తెలిపారు. అయితే రికార్డుల్లో 0.24 కుంటల భూమి మాత్రమే నమోదై ఉండగా, మిగిలిన 0.36 కుంటల భూమి రికార్డుల్లో నమోదు కాలేదని తెలిపారు . తన భూమిని రీ-సర్వే చేసి రికార్డులను సరిచేయాలని కోరుతూ సమర్పించిన వినతిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మణుగూరు తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కవిత, పదో తరగతి వరకు చదువుకున్నానని, తన భర్త గుండెపోటుతో మరణించడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. కుటుంబ పోషణకు ఉపాధి కల్పించాలని కోరుతూ సమర్పించిన వినతిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :