తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు ఘన సన్మానం - వేగం పుంజుకోనున్న వీకే సీఎం ప్రాజెక్టు పనులు.ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం.కొత్తగూడెం ఏరియాలో కీలకమైన వీకే సీఎం ఉపరితల గనికి నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.శంకర్‌కు కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన పీఓ జి.శంకర్‌కు శాలువాలు కప్పి,ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ.. వీకే సీఎం ఓసీపీ కొత్తగూడెం ఏరియాలో అత్యంత లాభదాయకమైన ప్రాజెక్టుల్లో ఒకటని, గత కొన్ని నెలలుగా అనేక సాంకేతిక, కార్మిక సమస్యలతో ప్రాజెక్టు పనులు కొంత మందగించాయని అన్నారు. నూతన పీఓగా అనుభవం కలిగిన జి.శంకర్ రాకతో ప్రాజెక్టు పనులు మరింత వేగంగా, సమర్థవంతంగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు."జి.శంకర్ ఎంతో అంకితభావంతో, కార్మికులతో సమన్వయంతో పనిచేసే అధికారిగా పేరు పొందారని.ఆయనకు అప్పగించిన ఈ బాధ్యతను పూర్తి నిష్టతో నిర్వహించి, కార్మికుల సంక్షేమం, గని భద్రత, ఉత్పత్తి లక్ష్యాలను సమపాళ్లలో సాధిస్తారని నమ్ముతున్నాం" అని నాయకులు అన్నారు.కార్మికులకు ఉన్న ప్రధాన సమస్యలైన మ్యాన్ పవర్ కొరత, యంత్రాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, సంక్షేమ సౌకర్యాలపై నూతన పీఓ దృష్టి సారించాలని బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య కోరారు.యాజమాన్యానికి, కార్మికులకు మధ్య వారధిగా ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య, ఆఫీస్ బేరర్ హీరాలాల్, వీకే సీఎం అసిస్టెంట్ పిట్ కార్యదర్శి కోటి, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్ (కమల్), కోటి, సీనియర్ నాయకులు రాజాలపూడి సాంబమూర్తి, ఓదెలు, శ్రీనివాస్, పాల్తేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం నూతన పీఓ జి.శంకర్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్మికుల సహకారంతో వీకే సీఎం ప్రాజెక్టును అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ