తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామీణ రోడ్ల అనుసంధానం, అభివృద్దే ధ్యేయం పల్లెలకు మౌలిక వసతుల కల్పనలో రాజీపడేదిలేదు రూ.10 కోట్లతో రేగళ్ల - కరకవాగు బిటి రోడ్డును నిర్మిస్తున్నాం గతంలో ఎన్నడూ లేని రీతిలో నియోజకవర్గ అభివృద్ధి నాణ్యతతో గడువులోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు గ్రామీణ రోడ్ల అనుసంధానం, అభివృద్దే ధ్యేయంగా నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. తాను ప్రత్యేక చొరవతో మంజూరు చేయించిన లక్ష్మీదేవిపల్లి - పాల్వంచ మండలాలను అనుసంధానించే 5 కిలోమీటర్ల మేర బిటి రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రేగళ్ల నుంచి పెద్దతండా, ఉయ్యాల బాడవ, హరియతండా, గేట్ తండా మీదుగా కరకవాగు వరకు రూ. 10 కోట్ల వ్యయంతో సాగుతున్న పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మారుమూల గిరిజన గూడేలు, తండాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా రాకపోకల ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో పల్లె బాటలను వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చూడటమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, తహసీల్దార్ సరితా, ఎంపిడివో సుస్మిత, అధికారులు రఘురామయ్య, స్థానిక నాయకులు, సర్పంచులు దీటి లక్ష్మీపతి, కంటెం శ్రీనివాస్, దారా శ్రీనివాస్, జర్పుల ఉపేందర్, తాటి లక్ష్మణ్, రాంబాబు, బాలాజీ, రమేష్, హత్తిరామ్, పూర్ణ, రాంబాబు, కంటెం శ్రీను, రామన్న, వీరబాబు, మాధవరావు, ఎస్ కె నాణ్య, ఓంజీ, బానోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ