Tuesday, 03 November 2026 12:52:09 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు, స్ఫూర్తి చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 27 September 2026 11:50 AM Views : 180

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమకారుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రజా జీవితంలో విశిష్ట సేవలు అందించారని, ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ఆదివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, రాష్ట్ర సాధన కోసం దీక్ష చేపట్టడంతో పాటు తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకుని ఉద్యమానికి అండగా నిలిచారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన జీవితాంతం కృషి చేశారని తెలిపారు. సమాజంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన ఆస్తులను సైతం దానం చేసిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఆయన చూపిన సేవా, త్యాగ మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.విజయలక్ష్మి , వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి, బీసీ సంఘ నాయకులు మోత్కూరి ధర్మారావు, చిప్పా శ్రీనివాస్, ఇమ్మడి ఉదయ్ కుమార్, బి సత్యనారాయణ, గమలాపురం సత్యనారాయణ, కొదుమూరు సత్యనారాయణ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :