Monday, 02 November 2026 05:32:04 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 30 October 2026 05:17 PM Views : 52

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కొత్తగూడెం క్లబ్‌లో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సైకిల్ ర్యాలీ, బైక్ ర్యాలీ, వ్యాసరచన పోటీలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలతో పాటు అన్ని సబ్ డివిజన్ల పరిధిలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, అత్యవసర సమయాల్లో రక్తం ఎంతమందికి ప్రాణదానం చేయగలదనే విషయాలను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం సమాజానికి అందించే గొప్ప సేవ అని పేర్కొన్నారు.ఈ మెగా రక్తదాన శిబిరంలో విద్యార్థులు, యువకులు, మహిళలు, రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం వారికి పండ్లు, పండ్ల రసాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎంహెచ్‌ఓ తుకారం నాయక్, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మి, జితేందర్, యాసిన్, ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్, నరేష్, ఆర్‌ఐలు రవి, లాల్‌బాబు, కృష్ణారావు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :