Monday, 02 November 2026 06:15:29 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభం

Date : 23 September 2026 04:49 PM Views : 132

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తుమ్మల చెరువుకు గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టుతో పది నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణకు చర్యలు: మంత్రి తుమ్మల తొలి విడతలో 4,300 ఎకరాలకు.. దశలవారీగా 22–23 వేల ఎకరాలకు సాగునీరు: మంత్రి పొంగులేటి జిల్లాలో సుమారు 16 వేల ఎకరాలకు సాగునీటి పనులకు శ్రీకారం: కలెక్టర్ అంకిత్ రైతుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ అశ్వాపురం మండలం మారేళ్లపాడులో ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రారంభించారు.మరెళ్లపాడు పథకం పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను తుమ్మల చెరువుకు విడుదల చేసిన మంత్రులు అనంతరం పథకాన్ని జాతికి అంకితం చేశారు. సుమారు రూ.610 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు, దశలవారీగా అశ్వాపురం మండలంలో 22 నుంచి 23 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అనంతరం గొందిగూడెం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తుమ్మల చెరువుకు గోదావరి జలాలు అందించాలన్న అశ్వాపురం ప్రాంత రైతుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారద్యం లో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి అశ్వాపురం, పినపాక ప్రాంతం నుంచి గోదావరి జలాలను పాలేరు వరకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. వివిధ కారణాలతో నిలిచిపోయిన పనులను ఆర్థిక ఇబ్బందులు, అనుమతులు, సవరించిన అంచనాలు తదితర సమస్యలను అధిగమిస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి అవసరమైన అదనపు నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఇల్లెందు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు జూలూరుపాడు టన్నెల్, లలితాపురం వద్ద ఎత్తిపోతల పథకం తదితర అంశాలపై సర్వేలు నిర్వహించి సవరించిన అంచనాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అన్నదైవం ప్రాజెక్టుకు కూడా గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల భూసేకరణలో రైతులు సహకరించాలని, భూములు కోల్పోయే వారికి న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు పది నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. భద్రాచలం నియోజకవర్గంలో ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి పాలెంవాగు, తాలిపేరు, మోడికుంటవాగు వంటి ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తే మరిన్ని మండలాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని చెప్పారు. పులుసుబొంత్ ప్రాంతంలో అటవీ అనుమతులు, ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు వంటి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సాధ్యమైన ప్రాంతాల్లో చిన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఏర్పాటు చేసి గోదావరి జలాలను నిల్వ చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. రబీ సీజన్‌లో తక్కువ నీటి అవసరం ఉన్న, తక్కువ కాలంలో పూర్తయ్యే పంటలను సాగు చేయాలని కోరారు. అశ్వారావుపేట, పినపాక ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని, అవసరమైన మేరకు మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల ఆర్థికాభివృద్ధి, సాగునీటి వనరుల విస్తరణ, వ్యవసాయ రంగ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ మేరకు రూ.350 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. పుష్కరాల నాటికి సాధ్యమైనంత మేరకు పనులు పూర్తి చేసి భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రహదారులు, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ , ప్రజా ప్రభుత్వం పేదలు, రైతులు, గిరిజనులు, మహిళలు, నిరుద్యోగులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత 30 నెలల్లో సుమారు 72 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :