Monday, 02 November 2026 07:00:12 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌&ఆర్‌ పనులను వేగవంతం చేయాలి అధికారులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం.

Date : 21 September 2026 07:02 PM Views : 124

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌&ఆర్‌ పనులను వేగవంతం చేయాలి. అధికారులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం.రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం–పునరావాస పునరుద్ధరణ (ఆర్‌&ఆర్‌) పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌&ఆర్‌ పనుల పురోగతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఐడీఓసీ కార్యాలయం నుంచి భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌&ఆర్‌ పనులకు అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. నీటిపారుదల శాఖకు కేటాయించిన నిధులతో పాటు ఇతర వనరుల నుంచి నిధులను బదిలీ చేసి అవసరమైన మేరకు సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.2026–27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ కోసం రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.1,050 కోట్లు, తాజాగా మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. విడుదలైన నిధుల్లో అధిక భాగం ఇప్పటికీ అధికారుల ఖాతాల్లోనే ఉండి లబ్ధిదారులకు చేరకపోవడం ఆందోళనకరమని అన్నారు. భూసేకరణ లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులను కలెక్టర్లు వేగవంతం చేయాలని ఆదేశించారు.నిధుల కొరత లేదా ఇతర కారణాలతో పరిహారం చెల్లింపులు నిలిచిపోతే సంబంధిత వివరాలను ప్రభుత్వానికి పంపి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. విడుదలైన నిధులను అధికారుల వద్ద ఉంచి పనులను పెండింగ్‌లో పెట్టవద్దని స్పష్టం చేశారు. భూసేకరణ పనులకు ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు అప్పగించడంతో పాటు, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు రెవెన్యూ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పురోగతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి సూచించారు. ఇప్పటికే విడుదలైన రూ.2,550 కోట్లను పూర్తిగా వినియోగించిన అనంతరం అవసరాన్ని బట్టి అదనపు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.భూసేకరణ ప్రక్రియలో రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు రైతులతో నేరుగా చర్చించి స్నేహపూర్వక వాతావరణంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ నిబంధనల ప్రకారం జరగాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పరిహారం మార్కెట్ విలువకు సాధ్యమైనంత సమీపంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి బడ్జెట్‌కు అదనంగా ఇతర వనరుల నుంచి నిధులు సమకూర్చి మంజూరు చేస్తున్నందున అధికారులు భూసేకరణను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయ్యేలోపు పెండ్లిపాకల రిజర్వాయర్ పనులు పూర్తయ్యేలా అవసరమైన భూసేకరణను ప్రాధాన్యతతో చేపట్టాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి సమస్యలు ఎదురైతే హైదరాబాద్‌లోని భూసేకరణ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇప్పటికే అవార్డులు జారీ చేసిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవార్డు జారీ చేసిన తరువాత కూడా ఎక్కువ కాలం పరిహారం అందకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో పాటు అధిక పరిహారం కోసం డిమాండ్లు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భూసేకరణ, ఆర్‌&ఆర్‌ పనులకు సంబంధించి సుమారు రూ.3,101 కోట్ల విలువైన పనులను గుర్తించగా, రూ.2,504 కోట్ల మేర నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. పరిహారం నేరుగా రైతులకు చేరేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో అధిక పరిహారం కోరుతున్న కారణంగా కొంత ఆలస్యం జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :