Sunday, 02 August 2026 05:22:09 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జూలూరుపాడు పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సదుపాయాలపై నిర్లక్ష్యం సహించబోము: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 31 March 2026 06:25 PM Views : 168

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం & జూనియర్ కళాశాల, అలాగే పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా స్థాయి, ఆహార నాణ్యత, తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతులు, పరిపాలనా వ్యవస్థపై సమగ్రంగా పరిశీలించారు.మొదటగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఎనిమిదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు తీసుకుంటున్న టిఫిన్, భోజన నాణ్యతపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాన్ని చదివించి వారి పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు. సిలబస్ పూర్తిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్, కిచెన్‌ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, బీట్‌రూట్ వంటి కూరగాయలు అందించకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకు తప్పనిసరిగా నాణ్యమైన, తాజా కూరగాయలతో ఆహారం అందించాలని ఆదేశించారు.విద్యార్థులు చేతులు శుభ్రపరచుకునే ప్రదేశంలో ట్యాపులు లేకపోవడం, మరమ్మతులు చేపట్టకపోవడంపై వివరణ కోరారు. పాఠశాలలో గ్యాస్ సదుపాయం, సిలిండర్ల లభ్యత, వంట సిబ్బంది సంఖ్య, నెలవారీ వ్యయాలపై వివరాలు తెలుసుకున్నారు. పనిచేయకుండా ఉన్న ఆర్.ఓ ప్లాంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్కువ వ్యయంతో మరమ్మతులు చేయవచ్చని ఉన్నప్పటికీ బయట నుంచి నీటి సరఫరా కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. అనవసర ఖర్చులను తగ్గించి నిర్వహణ నిధులను విద్యార్థుల సౌకర్యాల కోసం వినియోగించాలని సూచిస్తూ, ఒక వారం రోజుల్లో ఆర్.ఓ ప్లాంట్‌ను మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు.పాఠశాలలో సరుకుల సరఫరా విధానం, ఏఎన్ఎం అందుబాటు, రాత్రి డ్యూటీ సిబ్బంది వివరాలు, డ్యూటీ షెడ్యూల్, విద్యార్థుల టైమ్ టేబుల్‌ను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మజ పాఠశాలలో 166 మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలలో 92 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.అనంతరం పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, తరగతి గదులను పరిశీలించి ఏడవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాలలో మొత్తం 450 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రధానోపాధ్యాయులు సుభద్ర తెలిపారు.భోజనశాల, కిచెన్ షెడ్‌ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని రుచి చూసి నాణ్యతను పరీక్షించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన కూరగాయలను పరిశీలించిన సమయంలో దుర్వాసన రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన కూరగాయలను వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. వంటకు నాణ్యమైన, తాజా కూరగాయలనే వినియోగించాలని స్పష్టం చేశారు.స్టోర్ రూమ్‌లో నిల్వ ఉన్న బియ్యం తదితర సరుకులను పరిశీలించి వాటి నాణ్యతపై విచారణ చేశారు. ఆర్.ఓ ప్లాంట్‌ను పరిశీలించి తాగునీటి సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. విద్యార్థులకు యూనిఫార్ములు, నైట్ డ్రెస్సులు, స్పోర్ట్స్ డ్రెస్సులు సమయానికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్, అవి వినియోగంలో లేకపోతే ఎందుకు ఉంచారో ప్రశ్నించారు. కేవలం అలంకారంగా ఉంచడానికేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాటిని వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని లేదా అవసరం లేకపోతే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, “విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం తప్పనిసరిగా అందించాలి. పాఠశాలల్లో శుభ్రమైన త్రాగునీరు, పరిశుభ్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు. పనిచేయని ఆర్.ఓ ప్లాంట్లు, బయోమెట్రిక్ యంత్రాలను అలాగే ఉంచడం సరైంది కాదు. ఇవి అలంకారానికి కాదు. వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలి లేదా తొలగించాలి. అనవసర ఖర్చులను తగ్గించి విద్యార్థుల సౌకర్యాల అభివృద్ధికి నిధులు వినియోగించాలి. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి” అని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :