Thursday, 17 September 2026 07:04:04 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

లారీ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Date : 06 May 2025 04:46 PM Views : 1938

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 6 (తెలుగు వెలుగు ) : పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్తున్న లోడ్ రేషన్ బియ్యం లారీని వాహన తనిఖీల్లో గుర్తించి అదుపులోకి తీసుకొని స్వాధీనం చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం. కరుణాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్.ఐ.సి కార్యాలయ ప్రాంతంలో వన్ టౌన్ ఎస్సై జి.విజయ కుమారి తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సి.జి 04 పి.ఎక్స్ 0717 (C.G 04 P. X 0717) నెంబర్ గల ఓ కంపెనీకి చెందిన లారీ అనుమాన స్పందనంగా రోడ్డు పై వెళుతూ కనిపించింది. ఇది గమనించిన ఎస్సై ఆ లారీని ఆపివేసి అదుపులోకి తీసుకొని విచారించారు.ఆ లారీలో నలుగురు వ్యక్తులతో పాటు 687 బస్తాలలో సుమారు 343 క్వింటాల పి.డి.ఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న పి.డి.ఎస్ బియ్యం లారీతో పాటు నలుగురు నిందితులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ పి.డి.ఎస్ బియ్యాన్ని పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన పి.డి.ఎస్ బియ్యాన్ని ప్రజల వద్ద నుంచి కే.జీ రు.12 చొప్పున కొనుగోలు చేసి చత్తీస్గడ్ కామా ఇతర రాష్ట్రాలకు ఒక కే.జీకి రూ.20 చొప్పున అమ్ముకునేందుకు వెళ్తున్నట్లు బహిర్గతమైందని సీ.ఐ తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రు.12,36,600 లక్షలు ఉంటుందని వివరాలు వెల్లడించారు.నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసి, పరారైన మరో నలుగురి కోసం దర్యాప్తు వేగంగా చేస్తున్నట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అదుపులో తీసుకొని కేసు నమోదు చేసిన వారిలో.. ◆A-1) Chappidi Venkata Krishna @ Kittu S/o Mohan rao, 25 yrs, caste: Mala Dasari, Occ: Agril, R/o Fathimapuram cross road, Chintalapudi mandal, Eluru dist, Andhra Pradesh. A-2) Challagulla Ram Mohan rao @ Rambabu S/o Satyanarayana, 49 years, Kamma, Agriculture, R/o Narsannapalem village, Lingapalem mandal, Eluru district, Andhra Pradesh. A-3) Bhuvaneswar Saahu S/o Govardhan Saahu, Age 27 yrs, Caste Teli, Occ Lorry Driver R/o Jenjra village, Raajim Mandal, Gariyabad Dist, Chathisghar state. A-4) Chitranjan Tarak S/o Suresh Tarak, 22 yrs, Lorry cleaner, caste: Kosariya, R/o H.No 227, Kapsidihar village, Teka Post, Rajim mandal, Gariyabad Dist, Chathisghar state. **పరారైన వారిలో A-5) Chittela rama kanaka Chary s/o Satyanarayana, R/o Munukolla Village, thiruvur Mandal, NTR District, AP-(Absconding). A-6) Nagaraju driver of A5 (Absconding) A-7) Param Preeth singh Dhanjal r/o Raypur (Owner of the crime vehicle Lorry) -(Absconding) A-8) Kruthika Goswamy, -(Absconding) ఉండగా, మొత్తం ఎనిమిది మందిపై కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యాయి.చాకచక్యంగా వ్యవహరించి లోడు బియ్యం లారీని పట్టుకున్నందుకు వన్ టౌన్ పోలీస్ సిబ్బందిని కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్,భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :