Tuesday, 03 November 2026 09:33:01 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేరుస్తా - ఎంఎల్ఏ కూనంనేని

Date : 29 March 2025 06:47 PM Views : 923

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * 10ఎకరాల 18గుంటలకు రక్షణ కల్పిస్తా * ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం * రిపోర్టర్ల ఐక్యత చూస్తుంటే నా జర్నలిస్టు రోజులు గుర్తుకు వస్తున్నాయి * దీక్ష శిబిరాన్ని సందర్శించి , దీక్షను విరమిపజేసిన ఎంఎల్ఏ కూనంనేని భద్రాద్రి కొత్తగూడెం, కొత్తగూడెం, మార్చి 29 : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడు సిద్ధంగా వుంటానని, వారి చిరకాల వాంఛ ఇంటి స్థలం ఇప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గ ఎంఎల్ఏ కూనంనేని సాంభశివరావు అన్నారు. శనివారం గంగా బిసన్ బస్తీలో గత పది రోజులుగా చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యమాలకు తాను వ్యతిరేకం కాదు అని, ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేసారు. జర్నలిస్టు చేస్తున్న దీక్ష ఐక్యతను తీసుకు వచ్చిందని , ప్రభుత్వం జర్నలిస్టు లకు ఇవ్వాలని అనుకున్న 10ఎకరాల 18గుంటల భూమికి చుట్టూ ఫెన్సింగ్ వేయించి బోర్డు పెట్టించే పని చేపడతానని, ఆ తర్వాత భూమి జర్నలిస్టు లకు ఎలా పంపిణి చేయాలనే అంశం పై కలెక్టర్ , యూనియన్ లకు అతీతంగా కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అనంతరం జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో మాట్లాడుతూ మీలోని ఐక్యత , ఇలా అందరూ ఒకదగ్గర చేరడం చూస్తుంటే తనకు నా జర్నలిస్టు గా పని చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పి గత స్మృతులను పంచుకున్నారు.

ఆ రోజుల్లో ఐదారుగురు మాత్రమే వుండేవాల్లమని సమాజం , ప్రజల సమస్యల పై ఎప్పుడు చర్చించేవారమని తెలిపారు. ఇలాగే ఐక్యత కొనసాగాలని, భవిష్యత్ లో మీ అందరికీ ఇంటి స్థలం ఇచ్చి మీ కోరిక నెరవేర్చుతనని జర్నలిస్టులకు మరోసారి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, సీనియర్ పాత్రికేయులు జనుమాల రమేష్, T.v. నాగాచారి , కల్లోజి శ్రీనివాస్, డీవీ, రవీందర్, రవి, తారక్, వీరు, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :