తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతదేశంలో 2047 సంవత్సరం వరకు ప్రతి వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న ఐ ఆర్ డి ఏ (సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ) కి సపోర్ట్ గా టాటా ఏ ఐ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ మేము సైతం అన్నట్టు సంకల్ప యాత్రను శనివారం నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో వంద మందితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎస్పి అబ్దుల్ రహమాన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకతను స్లొగన్స్ ఇస్తూ బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.154 సంవత్సరాల అపార అనుభవం కలిగిన 150 రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న టాటా ఏ ఐ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ నమ్మకమైన బ్రాండ్ అని అన్నారు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన సొమ్ములో లైఫ్ ఇన్సూరెన్స్ లో కొంత దాచుకోవాలని దాని ద్వారా కుటుంబానికి భద్రతతో పాటు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. జీవిత బీమా ఉన్నవారు ధీమాతో ఉండవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో టాటా ఏ ఐ ఏ డిప్యూటీ డైరెక్టర్ వేముల వినోద్ కుమార్, కొత్తగూడెం బ్రాంచ్ రాహుల్, లీడర్లు కొచ్చర్ల కమల రాణి, నాగేంద్రారెడ్డి, మహబూబ్ పాషా, శివప్రసాద్, లోకేష్ ,వెంకన్న, వీరన్న, వీరభద్రం, నరెడ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ