తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత కేసులలోని వారెంట్లు అమలుపరచాలని, లేనియెడల జామీను దారులకు నోటీసుల ద్వారా కోర్టుకు పిలిపించాలని, ముద్దాయిలకు సమన్లు త్వరితగతిన అందజేయాలని పోలీస్ స్టేషన్ల వారీగా సమీక్షించి ఆదేశించారు. చెక్కు బౌన్స్ కేసులలో కూడా వారంట్ల అమలుపరిచే బాధ్యత,నోటీసులు ముద్దాయిలకు అందించే బాధ్యత పోలీసు అధికారుల లేదని గుర్తు చేశారు. గంజాయి కేసులలో వారంట్ లు అమలుపరచాలని లేదా జమీదారులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. గంజాయి కేసులలో వేరే రాష్ట్రంలోని వారికి బెయిల్ మంజూరు చేయకూడదని తెలిపారు. ఆర్ అండ్ బి అధికారులతో కొత్తగూడెం కోర్టులు మణుగూరు ఇల్లందు కోట్లలోని జరుగుచున్న జరగబోయే అదనపు నిర్మాణాల గురించి సమీక్షించి, త్వరితగతిన పూర్తిచేయాలని టెండర్లు ఇవ్వని వారికి త్వరితగతిన టెండర్లు పిలిచి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బత్తుల రామారావు, మొదటి అదనపు జ్యుడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ. సుచరిత, రెండవ అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే. సాయి శ్రీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి, స్పెషల్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, ఏపీపీవోలు ఎన్.లావణ్య, జి.నాగలక్ష్మి, బి. విశ్వశాంతి , కొత్తగూడెం ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెల్డండి వెంకటేశ్వరరావు, ఐ నాగేశ్వరరావు, సురేష్, జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి సి సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ యాదవ్,కొత్తగూడెం డి.ఎస్.పి అబ్దుల్ రహమాన్, ఇల్లందు డిఎస్పి చంద్రబాబు, పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్, ఎక్సైజ్ డిఎస్పి కరంచంద్, ఖమ్మం జిల్లా జైలరు శ్రీధర్, భద్రాచలం స్పెషల్ జైలర్ ఉపేందర్, ఇల్లందు జైలర్ చంద్రశేఖర్, కొత్తగూడెం, పాల్వంచ, యెల్లందు, మణుగూరు,భద్రాచలం డివిజన్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సైబర్ క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు ఏఎస్ఐలు, కోర్ట్ కానిస్టేబుళ్లు కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎన్.వీరబాబు
Admin
తెలుగు వెలుగు టీవీ