Wednesday, 16 September 2026 06:12:22 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రైతు వేదికలో జోరుగా రైతు వారోత్సవాలు.ఎమ్మెల్యే కూనంనేనితో పాటుగా పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు .

Date : 05 May 2026 08:21 PM Views : 265

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తగూడెంలోని రైతు వేదికలో సోమవారం రైతు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రభుత్వం రెవెన్యూ గ్రామానికి ఒక సాయిల్ వాలెంటర్లను నియమించిందని వీరి ద్వారా గ్రామంలోని రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించి తద్వారా వచ్చిన భూసార పరీక్ష కార్డు ద్వారా పోషక లోపాలను గుర్తించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ మరియు జీవన ఎరువుల వైపు రైతులు ఆలోచించాలని, సహజసిద్ధమైన వ్యవసాయం ద్వారా పెట్టుబడి తగ్గడంతో పాటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. సరైన పద్ధతిలో సరైన మోతాదులో సరైన సమయంలో ఎరువులు యాజమాన్యం పాటిస్తే చాలావరకు తెగుళ్లు మరియు పురుగుల బెడద ఉండదని వివరించారు. రైతు సోదరులందరూ ఎరువుల నియంత్రణ పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని, ఇది మానవాళి మనుగడకు ఎంతో అవసరమని చెప్పారు. అవసరానికి మించి ఒకే విడతలో ఎరువుల వాడకము చేయకూడదని, విడతల వారీగా వాడడం వల్ల మొక్కలు సమతుల్యంగా పెరుగుతాయని తెలిపారు.రైతులందరూ సమగ్ర ఎరువుల యాజమాన్యం, పోషకాల సమతుల్యత, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి సరైన యాజమాన్యం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు , ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, మాజీ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు, విద్యానగర్ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి మరియు వివిధ శాఖలఅధికారులు,సైంటిస్టులు ,ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :