Wednesday, 16 September 2026 05:57:48 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

వికె ఓపెన్ కాస్ట్ ను ప్రైవేకరిస్తే ఉద్యమాలు తప్పవు - ఎమ్మెల్యే కూనంనేని

Date : 16 October 2025 06:05 PM Views : 627

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వికె ఓపెన్ కాస్ట్ ను ప్రైవేకరిస్తే ఉద్యమాలు తప్పవు కార్మిక హక్కులకు బంగంకలిగించే చర్యలు మానుకోవాలి వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని కూనంనేని సమక్షంలో పలువురు కార్మికులు ఏఐటీయూసీలో చేరిక కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతనంగా ప్రారంభం కానున్న 'వికె ఓపెన్ కాస్ట్' ఉపరితల గని బొగ్గు వెలికితీత పనులను కాంట్రాక్టుకు అప్పగిస్తే ఉద్యమాలు తప్పవని, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే బొగ్గు వెలికితీత పనులు చేపట్టాలని సింగరేణి గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం వికె కోల్ మైన్ (వికెఓసి), పివికె 5బి మైన్స్లో జరిగిన పిట్ మీటింగులకు అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ప్రైవేటీకరణ అంటే మక్కువ అని, ప్రజలకు చెందాల్సిన దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే చర్యలకు పాల్పడుతున్నారని దీన్ని కార్మికవర్గం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులకు బంగం కలిగించే చేచర్యలను ఏలికలు మానుకోవాలన్నారు. స్ట్రక్చరల్ సమావేశాల్లో గుర్తింపు సంఘం లేవనెత్తిన సమస్యలు, డిమాండ్లపై యాజమాన్యం స్పందించి తక్షణం పరిష్కరించాలని కోరారు. కోల్ బెల్ట్ ప్రాంతాల్లో నూతన భూగర్భ గనుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. మైన్స్ విసిట్ సందర్బంగా యువ కార్మికులు వాంకుడోత్ హీరాలాల్, దేవర సురేష్, ఇస్లావత్ అశోక్, బాలకృష్ణ, అనిల్, రవి, రాములు, లెనిన్, సురేందర్ నాథ్ రెడ్డి తదితరులు కూనంనేని సమక్షంలో ఏఐటీయూసీలో చేరారు, వీరికి కూనంనేని ఎర్ర కండువాకప్పి యూనియన్లోని ఆహ్వానించారు. జిఏం కార్యాలయాన్ని సందర్శించిన కూనంనేని కొత్తగూడెం జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు గురువారం సందర్శించారు. జనరల్ మేనేజర్ శాలేంరాజు ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. అనంతరం కార్మికుల సమస్యలు, కార్మికవాడల్లో నెలకొన్న సమస్యల పరిస్కారంపై చర్చించారు. అయన వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, కేంద్రకమిటీ నాయకులు వంగ వెంకట్, జి వీరాస్వామి, వి మల్లికార్జునరావు, రమణమూర్తి, గట్టయ్య, సుధాకర్, ప్రసాద్, హుమాయూన్, సందబోయిన శ్రీనివాస్,ఎస్ నాగేశ్వర్రావు, భూక్యా రమేష్, బండారు మల్లయ్య, రాంచందర్, సిపిఐ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి తదితరులు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :