తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ మరియు అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 21 న సంస్మరణ కార్యమాలు నిర్వహించబడుతాయని,ఈ పోటీలకు విద్యార్థులతో పాటు,యువ ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఉత్సహంగా పాల్గొనాలని అన్నారు.ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు,పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవలి కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20వ తేదీలోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్ పిఆర్వోకు అందజేయాలన్నారు.ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలు, సైబర్ నేరాలు ఈవ్టీజింగ్,ర్యాగింగ్ , మత్తు పదార్థాల సేవనం, వాటి అనర్థాలు అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2023 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి వుంటుంది.ఈ నెల 20 వ తారీఖు లోపు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని PRO సెక్షన్ నందు ఇవ్వాల్సి వుంటుందని మరిన్ని వివరాల కోసం 8712682121 నెంబర్ ద్వారా పీఆర్ఓను సంప్రదించాలన్నారు.సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విద్యార్థులతో పాటు,ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ