తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల రామవరం 16వ డివిజన్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక నెహ్రు బస్తీలో జరిగిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న నగర ప్రముఖులు మునిగడప పద్మ, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు లు మాట్లాడుతూ ఆధునిక సమాజంలో వింత పోకడలు ,విష సంస్కృతులతో తల్లి, తండ్రి ,గురువు పట్ల నేటి యువత ప్రదర్శిస్తున్న తీరు చాలా ప్రమాద భరితముగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గురువు పట్ల విద్యార్థులు వినమ్రత, విధేయతలతో ఉండాల్సిన నేటి తరం కొంతమంది విద్యార్థులు వినయ ,విధేయతలను విస్మరించి గురువు యొక్క గౌరవాన్ని దిగదార్చుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వకాలంలో గురువు అంటే ఎంతో గౌరవం ఉండేదని, ఎలాంటి జీతభత్యాలు లేని రోజుల్లో గురువులకు శిష్యుడు ఇచ్చిన గురుదక్షిణతో వారి కుటుంబాన్ని గడుపుకుంటూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఆనాటి సమాజం భవిష్యత్ తరాలకు ఎంతో ఆదర్శంగా నిలిచారని చరిత్ర చెబుతుందని, నేటి సమాజంలో అక్కడక్కడ గురువులు ప్రదర్శిస్తున్న తీరు కూడా భయాందోళన కరముగా ఉందని అన్నారు. అందుకే నేటితరం ఉపాధ్యాయులు, విద్యార్థులు గత గురువుల స్థాన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ఉద్ఘాటించారు. అందుకే అంగన్వాడీ సెంటర్ల ద్వారా చిన్నతనం నుండే గురువు పట్ల గౌరవభావం కలిగేటట్లుగా ఇక్కడ విద్యార్థులు తయారవుతున్నారని ఇది చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఒకప్పుడు ఆది గురువు అమ్మ అయితే నేడు అంగన్వాడి సెంటర్లలో గర్భం దాల్చిన నాటి నుండి శిశువు జన్మించి అంగనవాడి సెంటర్లలో అక్షరాభ్యాసం నేర్చుకోవడం వరకు ఆది గురువు పాత్రను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్వీకరించడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్(19) లోని తల్లిదండ్రుల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ ఎన్ సరోజ, రమాదేవి ,జయ,లను శాలువాలు బొకేలతో ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 19వ సెంటర్లో టీచర్ సరోజ పిల్లల పట్ల ఎంతో అంకితభావంతో విద్య తో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఇతర జాతీయ పండుగలను నిర్వహించి చిన్నారులకు అవగాహన కల్పించడం ఆమెకు వృత్తి పట్ల ఉన్న గౌరవం గొప్పదని కొనియాడారు. అంగన్వాడీ టీచర్స్ తమకు ఓనమాలు దిద్దించిన ఆ చిన్నారుల చేతి ముద్రలతో కూడిన జ్ఞాపిక ఫోటోలను టీచర్స్ కి అందించారు . అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్ పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో రంగు సింధు ,సంతోషి, బ్రీజిట్, కళ్యాణి, ప్రభావతి, తల్లులు రాజ్యలక్ష్మి, శ్రావణి, కళ్యాణ్, విద్యార్థులు ,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ