తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.గురువారం రామవరం సాధన గ్రౌండ్ నందు అంబేద్కర్ ఐటీఐ కరస్పాండెంట్ వెలన్ కుమార్ తండ్రైన దొరై మెమోరియల్ రెడ్ బాల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని, ప్రతీ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని గెలుపొందిన వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని,ఓటమి చెందిన వారు మరింత సాధన చేసి భవిష్యత్ లో గెలుపొందుటకు కృషి చేయాలన్నారు.యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో వెళ్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.ప్రస్తుత తరుణంలో క్రికెట్ పోటీలను నిర్వహించడం ఆషామాషీ విషయం కాదని పోటీలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు.క్రికెట్ పోటీలు విజయవంతం కావాలని ఆకాక్షించారు కామేష్ కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకురి ధర్మారావు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు ఎక్కువ నిధులను కేటాయించడం జరుగుతుందని,భవిష్యత్తులో గ్రౌండ్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో వెలెన్ కుమార్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవీప్రసన్న, మోరె రమేష్,అప్పారావు,అశోక్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ