తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : ఇల్లందు మండలం కొమరారం అటవీ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ అధికారి నునావత్ హరిలాల్ పట్టుబడ్డారు. అటవీ భూమి నుంచి గ్రావెల్ తరలించేందుకు ఓ వ్యక్తిని రూ. 30 వేలు డిమాండ్ చేయగా సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ