తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వాలీబాల్.. బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి,మైదానంలో ఉత్సాహం.. క్రీడాకారుల్లో జోష్.కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని పలువురు నాయకులు పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సానుకూల ఆలోచనా విధానం పెంపొందుతుందని తెలిపారు.2026–27 వార్షిక సంవత్సరానికి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో బుధవారం కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్తంగా వాలీబాల్, బాస్కెట్‌బాల్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,క్రీడలు వ్యక్తిగత జీవితంలో ఉత్సాహాన్ని, క్రమశిక్షణను పెంచడంతో పాటు మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయని అన్నారు.గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు. ఎలాంటి గాయాలు, ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు పాటిస్తూ పోటీల్లో పాల్గొనాలని కోరారు. ప్రాంతీయ, కంపెనీ స్థాయి, కోల్ ఇండియా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీవైపీఎం జి.హరీష్, కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, సత్తుపల్లి ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సముద్రాల సుధాకర్, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కే.కోటేశ్వరరావు, స్పోర్ట్స్ కో–ఆర్డినేటర్ సందబోయిన శ్రీనివాస్, జనరల్ కెప్టెన్ రాజశేఖర్, యూనియన్ ప్రతినిధులు, వివిధ క్రీడల కెప్టెన్లు, క్రీడాకారులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ