Thursday, 17 September 2026 12:43:08 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి..*ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మేస్త్రీలదే కీలక పాత్ర..

Date : 03 March 2025 06:51 PM Views : 1204

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఇండ్ల నిర్మాణంలో మేస్త్రీలదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం నేషనల్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ( న్యాక్ ) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మేస్త్రీల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, గట్టితనం ఉండేలా, వ్యయాన్ని తగ్గించేలా, ఇంటి నిర్మాణ సామగ్రి వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలపై మేస్త్రీలకు శిక్షణ ఇస్తున్నారని అన్నారు.పేదలకు తక్కువ ఖర్చుతో పటిష్ఠంగా, పూర్తి భద్రతతో ఇండ్లు ఎలా నిర్మించాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంటిని 400 చదరపు అడుగుల లోపు నిర్మించాలని సూచించారు.ప్రభుత్వం అందజేసే రూ.5లక్షలతో క్వాలిటీతో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం లో భాగంగా నాలుగు దశల్లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొదటి విడతగా బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, రెండవ విడతగా గోడల నిర్మాణం పూర్తి అయిన తర్వాత లక్ష 25 వేల రూపాయలు, మూడవ విడత స్లాబ్ పూర్తయిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు మరియు నాల్గవ విడతగా ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత లక్ష రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.పేదలకు నిర్మించే ఇండ్లను నాణ్యంగా మరియు దృఢంగా నిర్మించాలన్నారు. ఆరు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా మేస్త్రీలకు టీ షర్ట్ లు, హెల్మెట్, బ్యాగు పంపిణీ చేశారు. శిక్షణ కార్యక్రమంలో 30 మంది మేస్త్రీల కు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి శంకర్, మెప్మా పి డి రాజేష్, మ్యాక్ అధికారిని హెప్సిబా , ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :