Saturday, 19 September 2026 06:50:02 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన TGBIE డిప్యూటీ సెక్రటరీ. సిహెచ్. హేమచందర్.

Date : 05 February 2026 07:55 PM Views : 171

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి డిప్యూటీ సెక్రటరీ సిహెచ్. హేమచందర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం, పాల్వంచ, అశ్వరావుపేట, ములకలపల్లి మరియు భద్రాచలం ప్రాంతాల్లోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు.ఈ తనిఖీల సందర్భంగా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులు, ల్యాబ్ ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, ప్రశ్నపత్రాల గోప్యత, పరీక్షల నిర్వహణ విధానాలు, పారదర్శకత తదితర అంశాలను డిప్యూటీ సెక్రటరీ పరిశీలించారు. నిబంధనల ప్రకారం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు, పరీక్షా సిబ్బందికి సూచనలు చేశారు.ఈ రోజున నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షల హాజరు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలలో జనరల్ విభాగంలో 923 మందికి గాను 898 మంది హాజరుకాగా 25 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్య విభాగంలో 407 మందికి గాను 383 మంది హాజరై 24 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 1330 మందికి గాను 1281 మంది హాజరు కాగా 49 మంది గైర్హాజరయ్యారు.మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలలో జనరల్ విభాగంలో 782 మందికి గాను 761 మంది హాజరై 21 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్య విభాగంలో 300 మందికి గాను 278 మంది హాజరై 22 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా మధ్యాహ్నం 1082 మందికి గాను 1039 మంది హాజరు కాగా 43 మంది గైర్హాజరయ్యారు. మొత్తం రోజువారీగా రెండు సెషన్లలో కలిపి 2412 మందికి గాను 2320 మంది హాజరై 92 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :